Bithiri Sathi : బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన కామెడీతో బుల్లితెరపై అలరించి ఆ తర్వాత వెండితెరపై తెగ సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముదిరాజ్ మహాసభలో బిత్తిరి సత్తి అధికార పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సినిమాలు, సినిమా ఫంక్షన్స్ కి హోస్టింగ్ చేస్తూ బిజీబిజీగా ఉన్న బిత్తిరి సత్తి ముదిరాజ్ మహాసభకు హాజరవడమే కాకుండా.. ముదిరాజ్ సామాజిక వర్గానికి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఒకరకంగా చూస్తే ముదిరాజ్ మహాసభ వేదికపై నుండే ముదిరాజ్ సామాజికవర్గం వారిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా అనే సందేహం కూడా కలిగేలా చేసింది. తెలుగు దెంకరోళ్లు అంటున్నారు.. ఎవడురా తెలుగు దెంకరోళ్లు..కొడుకుల్లా అణగపెట్టి గుద్దిత్తే వంగబడి పిత్తాలి. తాగుబోతుల జాతినారా మాది అంటూ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చాడు బిత్తిరి సత్తి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన సంఘాల నాయకులు, కార్యకర్తలు బిత్తిరి సత్తిని జడ్చర్ల నుండి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు తెలిసింది. సొంత సామాజిక వర్గం వారే ప్రోత్సహిస్తుండటంతో బిత్తిరి సత్తి కూడా రాజకీయ ప్రవేశంపై మొగ్గు చూపిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం లభిస్తే పోటీ చేయడానికి బిత్తిరి సత్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముదిరాజ్ సభలో ఈటలపై సత్తి ప్రశంసలు కురిపించడంతో బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఈ విషయంపై బిత్తిరి సత్తి స్పందిస్తూ.. జడ్చర్లకు సంబంధించిన పలువురు మిత్రులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, పోటీ చేసే విషయంపై సమాలోచనలు చేస్తున్నాం ” అని అంగీకరించారు. బిత్తిరి సత్తి కూడా ఈ వార్త నిజమేనని అంగీకరించడంతో ఇక బిత్తిరి సత్తి పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అనే ప్రచారం జరుగుతోంది. మరి రానున్న రోజులలో దీనిపై అయితే క్లారిటీ రానుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…