Nara Devansh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నా.. అడుగు ముందుకేయడానికి పోలీసులు సహకరించకున్నా సరే.. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు లోకేష్. ఆయనపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలన్నా కనీసం మైక్‌లో మాట్లాడటానికి ఖాకీలు అనుమతివ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొదటి రోజు నుంచే ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయన పాదయాత్ర సాగుతుంది.
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని 2019లో మంగళగిరి ఓటర్లు తనపై కరుణ చూప లేదని, ఓడినా ప్రజలమధ్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారి వెన్నంటే ఉన్నానని చెప్పారు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను వ్యక్తిగత నిధులతో చేపట్టానని వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువత గళాన్ని సైకో ప్రభుత్వానికి విన్పించేందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, విద్యాప్రమాణాల పెంపుదలకు కృషిచేస్తామన్నారు.
విశాఖపట్టణానికి ఐటీ హబ్‌లని తీసుకొచ్చే బాధ్యత లోకేష్‌ది అని ఆయన అన్నారు .కేజీ నుండి పీజీ వరకు విద్యని పటిష్టం చేస్తాం. కోడింగ్, ప్రోగ్రామ్ అనేది కూడా స్కూల్స్‌లో తీసుకొస్తాం. దేవాన్ష్ ఇప్పుడే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాడు. లెబో రోబోటిక్ కోర్స్ కూడా చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఎనిమిదేళ్లే. ఈ అవకాశం ఆంధ్రులకి ఎందుకు ఉండకూడదు. మీకు కూడా అది తెచ్చే ప్రయత్నం చేస్తాం అని లోకేష్ చెప్పుకొచ్చారు. వచ్చే జనరేషన్ మరింత స్ట్రాంగ్‌గా మార్చేందుకు మా వంతు కృషి చేస్తామని అని లోకేష్ స్పష్టం చేశారు.