Krishnamma OTT : ఒకప్పుడు థియేటర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం 3 నెలలు అయిన సమయం పట్టేది. కాని ఇప్పుడు వారం తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా సత్యదేవ్ నటించిన చిత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టి ఆడియన్స్‌కి షాకిచ్చింది. హీరో సత్యదేవ్ రివెంజ్ డ్రామా ‘కృష్ణమ్మ’ గత శుక్రవారం (మే 10) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాగా, ఈ మూవీకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కాని పెద్దగా ఆడియన్స్ థియేటర్స్‌కి రాలేదు. అయితే సరిగ్గా ఆక్యుపెన్సీ లేకపోవడంతో మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు.
కృష్ణమ్మ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నేడు 17నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా .. తెలుగు సినిమాకు ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది కృష్ణమ్మ. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఓటీటీలో కృష్ణమ్మ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
నిజానికి కృష్ణమ్మ సినిమాను సత్యదేవ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు. రివ్యూల్లో కూడా సత్యదేవ్ నటనకి మంచి మర్కులు పడ్డాయి. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి రాకుండా హ్యాండ్ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. అందులోనూ ఎలక్షన్ హడావిడి కూడా నడుస్తుండటంతో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలో అడుగుపెట్టలేదు. దీంతో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. నిమాకు ప్రజెంటర్‌గా కొరటాల శివ వ్యవహరించడంలో కృష్ణమ్మపై బజ్ బాగానే ఏర్పడింది. ప్రమోషన్స్‌లో సుకుమార్‌తో పాటు పలువురు అగ్ర దర్శకులు పాల్గొనడం, ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకోవడంతో గత వారం రిలీజైన తెలుగు సినిమాల్లో కృష్ణమ్మపైనే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి.