Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనకి మద్దతుగా చాలా మంది రాజకీయ నాయకులు నిలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబుని బయటకు తీసుకు వచ్చేందుకు చాలా కృషి చేస్తున్నారు. తాజాగా నారా బ్రాహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్‌ను కూడా నేడో, రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారని.. తప్పుచేయని తాము ఎవరికీ భయపడమని అన్నారు. ‘మా వెనుక 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, టీడీపీ కుటుంబం ఉంది. మాలో పోరాట స్ఫూర్తి ఉంది. న్యాయ వ్యవస్థపై మాకు అపారమైన నమ్మకం ఉంది’ అని బ్రాహ్మణి అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శనివారం (సెప్టెంబర్ 16) సాయంత్రం రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం మీడియాతో నారా బ్రాహ్మణి మాట్లాడారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన నేపథ్యంలో చంద్రబాబు యాత్రలకు, నారా లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదారణ చూసి భయపడే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు వేసిందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. 8 ఏళ్ల తన బాబు దేవాన్షన్ రిమాండ్ రిపోర్ట్‌ను చదివినా ఇందులో సాక్ష్యం ఎక్కడుందని ప్రశ్నిస్తారంటూ బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటూ ఆమె విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోంది. అందుకే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు.. రాష్ట్ర ప్రజలు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు’ అని బ్రాహ్మణి అన్నారు.
నేను రాజమండ్రిలో ఉన్నాను. లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. దేవాన్ష్ సింగిల్‌గా ఉంటున్నారు. మా పరిస్థితి ఇలా ఉందని బ్రాహ్మణి చాలా ఫీలైంది. చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు ఐటీని తెచ్చి రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’ అని బ్రాహ్మణి ప్రశ్నించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…