Nara Bhuvaneshwari : టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి… మాట్లాడుతూ..లోకేశ్ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చారు. తొలత పాదయాత్ర చేస్తుంటే తన కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. లోకేశ్ తనకు ధైర్యం చెప్పిన తర్వాత తనలో మనోధైర్యం వచ్చిందన్నారు. ప్రస్తుతం పాదయాత్రలో లోకేశ్ రాటు తేలిపోయారని ఆనందం వ్యక్తం చేశారు.
పాదయాత్రలో నారా లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాను ఫోన్ చేసి అడిగినా అంతా బాగుందని చెబుతాడని, తన ఆరోగ్య సమస్యల గురించి మాత్రం చెప్పడదన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం ముందు తమ కష్టం ఏపాటిదన్నారు. నాలుగు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ అండగా నిలబడుతున్నందుకు తల్లిగా తాను సంతోషిస్తున్నానన్నారు. ఇప్పటికే యాత్ర విజయవంతమైందని, పూర్తయ్యే సమయానికి మరింత విజయం సాధిస్తుందని ఆశించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు వడ్డీ పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భువనేశ్వరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…