Nagarjuna : టాలీవుడ్ కింగ్, మన్మథుడు అనగానే మనందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు నాగార్జున. ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికీ నవ మన్మథుడిలానే కనిపిస్తుంటారు. అయితే నాగ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఈయన మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఎంతో మందితో ప్రేమాయణం నడిపించినట్టు ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబుతో నాగ్ కెమిస్ట్రీ బాగుండడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిపై నాగార్జున ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టబు గురించి తను మాట్లాడిన పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.
ప్రస్తుతం నాగార్జున. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా చకా చకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే గత కొంత కాలంగా భారీ హిట్ లేక ఉన్న ఆయన తాజాగా ఈ సంక్రాంతికి నా సామి రంగ అంటూ వచ్చి బాక్సాఫీస్ ముందు రచ్చ చేశారు. పెద్ద సక్సెస్ అందుకుని వెళ్లిపోయారు. సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ప్రస్తుతం వేరే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే నాగార్జున గతంలో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అలానే నాగ్‌కి ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్. వీరు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. భారీ హిట్ల కోసం శ్రమిస్తున్నారు.
టబుతో రిలేషన్‌షిప్ చాలా దూరం వెళ్లిందని ప్రచారం అయ్యింది అని నాగార్జునకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అలా ప్రచారం అయ్యింది ఎందుకంటే.. టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. అమల దగ్గరుండి టబుకు ఇల్లు కట్టించింది. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియనిది ఏంటంటే టబు హైదరాబాద్ అమ్మాయి. అలా పరిచయం అయ్యింది. అప్పటినుండి మాకు తెలిసిన అమ్మాయే. నా ఫేవరెట్ హీరోయిన్, ఇష్టమైన కో వర్కర్ ఎవరంటే టబు అనే చెప్తాను. ఇప్పటికీ హైదరాబాద్ వస్తే ఇంకెక్కడికీ వెళ్లదు. మా ఇంట్లోనే ఉంటుంది.
నాన్నకు కూడా తనంటే అంతే ఇష్టం’’ అని టబు చాలా కుటుంబానికి కూడా చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చారు నాగార్జున.తను చాలా ఎమోషనల్ అమ్మాయి. నేను తన డాక్టర్‌లాగా. ఎప్పుడో తెల్లవారుజామున ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఎవరా అని భయపడుతూ లిఫ్ట్ చేస్తాను. అవతల వైపు నుండి ఏడుస్తూ ఉంటుంది. ముందు ఏ బాయ్‌ఫ్రెండ్‌తో ఏ సమస్య వచ్చింది అని అడుగుతాను. అవును అని ప్రాబ్లెమ్ అంతా చెప్తుంది. ఒక గంటసేపు నాకు నిద్ర ఉండదు. నాకు తెలిసింది ఏదో చెప్తాను. మా ఫ్రెండ్‌షిప్ అనేది మాటల్లో చెప్పలేనిది అని నాగ్ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…