Varalakshmi Sarathkumar : తమిళ నటి పేరు వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సీనియర్హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఫిల్మ్ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట హీరోయిన్గా అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ఆర్టిస్ట్గా మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్పాన్ ఇండియా బ్లాక్ బస్టర్హిట్చిత్రం ‘హనుమాన్’లోనూ హీరో అక్క అంజమ్మగా తన నటనతో అదరగొట్టేసింది.
అయితే విభిన్న పాత్రల్లో విలక్షణమై నటనతో అభిమానుల్ని అలరిస్తున్న ఈమె పెళ్లికి రెడీ అయింది. కొద్ది రోజుల క్రితం నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది. నికోలాయ్ సచ్ దేవ్ గ్యాలరిస్ట్ అని ప్రకటించారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వరలక్ష్మి, నికోచాయ్ లకు గత 14 సంవత్సరాలుగా స్నేహితులు అని తెలుస్తుంది.ఇక వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా వరలక్ష్మీ తన ఎంగేజ్మెంట్ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మార్చి1న వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరగ్గా.. మార్చి 5న ఆమె తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇలా తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైన రెండు విషయాలను కొద్ది రోజుల గ్యాప్ లో జరుపుకోవడంతో వరలక్ష్మి చాలా హ్యాపీగా వుంది.
తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలిపింది. వండర్ ఫుల్ బ్లెస్సింగ్స్ కు, లవ్లీ బర్త్ డే విషెస్ అందజేసిన వారందరికీ థాంక్స్. ఇది నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం. మీరందరూ అందులో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని తన నిశ్చితార్థ వేడుక వీడియోని పంచుకుంది. ఒకరికొకరు దండలు మార్చుకోవడం.. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకొని ఐ లవ్ యూ చెప్పుకోడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో శరత్ కుమార్ – రాధిక దంపతులు కూడా సందడి చేశారు. ఇక వరు తన కాబోయే భర్తను లిప్ కిస్ లతో ముంచెత్తడం అందరిని ఆశ్చర్యపరిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…