Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద చర్చనీయాంశం అయింది. నాగబాబు ఎవరి గురించి చేశాడో తెలియదు కాని అందరు కూడా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారంటున్నారు. అయితే అసలు వివాదం ఏంటంటే.. నంద్యాల వెళ్లడానికి ముందురోజు బన్నీ పవన్ కల్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి అంతటితో సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టతనిచ్చారు.
కాకపోతే నాగబాబు.. బన్నీని ఉద్దేశించే ట్వీట్ పెట్టాడని రచ్చ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ ఆర్మీ రంగంలోకి దిగి నాగబాబుకి చుక్కలు చూపించారు. అల్లు అర్జున్ ట్విటర్ ఖాతాలో అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బన్నీ అభిమానులు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు ..అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా? లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా? లేదంటే బన్నీ కౌంటర్ వేయాలని ఇలా చేశాడా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
బన్నీ.. శిల్పా రవిచంద్రారెడ్డి తనకు దగ్గరి మిత్రుడు కావడం వల్లే వెళ్లానని.. తన స్నేహితులు ఎక్కడ ఉన్నా వారి మేలు కోరుకుంటానంటూ అల్లు అర్జున్ తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. కానీ నాగబాబు మాత్రం తన ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారి తీసింది. గత ఐదారు రోజులుగా సోషల్‌మీడియా పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య ట్రోలింగ్స్, విమర్శలు నడుస్తున్న నేపథ్యంలో నాగబాబు ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…