Naga Chaitanya : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను ఇటీవలే హైడ్రా టీమ్ నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. సినీ నటుడు నాగార్జున మాదాపూర్‌లోని తుమ్మిడి కుంట చెరువు ఎఫ్‌టీఎల్ జోన్‌ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారంటూ హైడ్రా టీమ్ ఆయనకు నోటీసులు ఇచ్చి మరీ కూల్చివేతలు చేపట్టింది. అయితే హైడ్రా టీమ్ ఎప్పుడో తెల్లవారుజామునే కూల్చివేతలు చేపట్టగా నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సరికి ఆలస్యం అయింది. కానీ అప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నేలమట్టం చేశారు.
అయితే దీనిపై నాగార్జున ట్విట్టర్‌లో స్పందించారు. తాను అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని, పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించానని, ఈ కేసు కోర్టులో ఉందని, అలాంటప్పుడు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చడం దారుణమని నాగార్జున ట్వీట్ చేశారు. అయితే దీనిపై నాగార్జున తనయుడు నాగచైతన్య స్పందించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్యను జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. అందతా నాన్నగారు చూసుకుంటన్నారు, ఈ విషయంపై ఆయన ఇప్పటికే ట్విట్టర్‌లో చెప్పారు, ఇక దీని గురించి ప్రస్తావించకండి.. అన్నారు. అంటే దీని గురించి మాట్లాడేందుకు నాగచైతన్య ఇష్టపడడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక శోభితతో మీకు వివాహం ఎప్పుడు జరగబోతుంది అని అడగ్గా.. అందకు చైతూ స్పందిస్తూ.. పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు, డెస్టినేషన్‌ను కూడా ఎంపిక చేయలేదు, అవి ఫిక్స్ అయితే మీకు చెబుతా.. అని అన్నాడు.
ఇక లేటెస్ట్‌గా చైతూ నటిస్తున్న తండేల్ మూవీ గురించి అడగ్గా అందుకు చైతూ మాట్లాడుతూ.. తండేల్‌లో తన లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, అందుకోసమే ఇలా మేకోవర్ అయ్యానని తెలిపాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, తండేల్ మూవీ ఒకెత్తు.. అని అన్నాడు. కాగా తండేల్ మూవీని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇక నాగచైతన్యకు, శోభిత ధూళిపాళకు ఆగస్టు 8న నిశ్చితార్థం అయింది. దీంతో వారిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…