మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా నాగబాబు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా, నిర్మాతగా, జడ్జిగా రాణిస్తున్నారు. తన సొంత బ్యానర్ మీద ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీ నష్టాలను మిగిల్చుకున్న నాగబాబు ప్రస్తుతం నిర్మాణానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు. ఇక తన కొడుకు వరుణ్ తేజ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు ఆస్తులకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. నిర్మాతాను సక్సెస్ కాలేదు.జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. జబర్ధస్త్ షోను వీడినా.. పలు టీవీ షోల్లో యాంకర్‌గా తనదైన ముద్ర వేసారు.ఎన్నికల సందర్భంగా నాగబాబు తన ఆస్తుల చిట్టాను బయట పెట్టడంతో ఎంత సంపాదించారన్న విషయం బయటపడింది.
నాగేంద్రబాబు ఆస్తులు మొత్తం రూ.41 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో వాహనాలు, చరాస్తులు 36.73 కోట్లు కాగా.. స్థిరాస్తులు 4.22 కోట్లు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఇక ఇందులో ఆయనకు 2.70 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. అంటే నాగబాబు ఆస్తులు నికరంగా రూ.38 కోట్లు.. కానీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు రోజుకు ఒక్కో చిత్రానికి రూ.4.5 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు సమాచారం. నాగబాబు హీరోగా కంటే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గానే మంచి విజయాన్ని అందుకున్నారు. మెగా హీరోలపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి కౌంటర్ ఇచ్చే విషయంలో నాగబాబు ముందువరసలో ఉంటారు. ఆరు పదుల వయస్సులో కూడా నాగబాబు ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…