Nadendla Manohar : తెలంగాణ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. ఈ సారి ఎన్నికలలో ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందా అని అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అయితే జనసేన తొలిసారి కాంగ్రెస్ పోటీకి దిగుతుండగా, ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రచారాలు చేయడం లేదు. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
మనోహర్ పాల్గొని మాట్లాడుతూ… ‘‘ఈనెల 26వ తేదీన కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. కూకట్‌పల్లిలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాము. అనుకొని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చింది. అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం, మహా నగరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి అందరం తోడ్పడ్డాము. ఆంధ్ర నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నాము.
ఐటీ విభాగం ఎంతో కృషి చేసి జనసేన పార్టీని ప్రజలల్లోకి తీసుకొని వెళ్లాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎప్పుడు 21 బీ ఫారంలో అభ్యర్థులకు ఇచ్చి వెనక్కి తీసుకోవటం జరిగింది. వైఎస్సార్టీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయి. ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయని, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందన్నారు. కూకట్‌పల్లిలో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దామన్నారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వంటి నాయకుడు లేడన్నారు.