Nadendla Manohar : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ఎంపికైన వారందరు కూడా యాక్షన్‌లోకి దిగారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ స్టాక్ పాయింట్ల తనిఖీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత క్షేత్రస్థాయిలో స్టాక్ పాయింట్లను పరిశీలించిన మంత్రి.. అనేక అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సరఫరాదారులను హెచ్చరించారు. తెనాలిలో నిల్వగోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె.. తదితర ప్యాకెట్ల బరువు 50 – 100 గ్రాములు తక్కువగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
అనంతరం, మంగళగిరిలో చేసిన తనిఖీల్లోనూ ఇదే బాగోతం వెలుగు చూసింది. దీంతో, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు. ఇటీవల తాను జరిపిన తనిఖీల్లో 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్.. క్షేత్రస్థాయి పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. పౌరసరఫరాలశాఖ ద్వారా పంపిణీ చేసే సరకులకు తూకం వేయించారు. అనంతరం అవి బరువు తక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే ప్యాకింగ్ లోపాలను సైతం గుర్తించారు.
అక్కడి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వక్తం చేశారు. తరువాత సంబంధిత అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల ద్వారా పేదలకు ఇచ్చే రేషన్.. నుంచి అంగన్‌వాడీ, వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తూకం ఒక్కటే కాకుండా, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి సహకారంతోనే ఇష్టారాజ్యంగా ఐదేళ్లుగా ఈ దోపిడీ సాగుతోందట. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనూ రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. డీలర్లకు సరఫరా చేసే బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోంది. ఒక్కో బస్తా 5 – 8 కిలోల వరకూ బరువు తక్కువగా ఉంటోందని, అయినా, అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు కిమ్మనకుండా ఉండిపోతున్నారట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…