Anant Ambani : భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం కొద్దిరోజులుగా అట్టహాసంగా జరుగతుంది. ఇక పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జామ్ నగర్ లోని రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముకేశ్ అంబానీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఇతర అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్థులకు సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు.
సుమారు 51 వేల మంది స్థానికులకు భోజనం వడ్డించారు. అయితే ఈ కార్యక్రమంలో రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. అంబానీ కుటుంబం స్థానికుల ఆశీర్వాదం పొందడానికి అన్న సేవను నిర్వహించింది. భోజనానంతరం హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతంతో మైమరిచిపోయారు. ప్రఖ్యాత గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ ఈ కార్యక్రమానికి సంగీత ఆకర్షణను నిలిచాడు..రెండవ రోజు అతిథులకు డ్రెస్ కోడ్ జంగిల్ ఫీవర్. ఈవెంట్ కోసం అతిథులందరూ సౌకర్యవంతమైన దుస్తులు ధరించారు. అతిథులందరూ దుస్తుల కోడ్‌ను అనుసరించారు.. జంతువుల ప్రింట్‌ల నుండి రంగురంగుల ప్యాలెట్ వరకు సౌకర్యవంతమైన దుస్తులను వేసుకున్నారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ, ఆమె కాబోయే కోడలు రాధికా మర్చంట్‌లు ప్రత్యేక శైలిలో కనిపించారు. రాధికా మర్చంట్ యానిమల్ ప్రింట్ బ్లూ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించారు. దీనితో పాటు ఆమె మ్యాచింగ్ టోపీని కూడా పెట్టుకున్నారు. కాగా నీతా అంబానీ సీక్విన్ గోల్డ్ ప్యాంట్‌తో ప్రకాశవంతమైన ఆకుపచ్చ చొక్కా ధరించారు. ఈ ఫంక్షన్‌లో ఆమె గ్లామరస్ లుక్‌కి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అయితే ఈవెంట్ లో అనంత్ మాట్లాడిన మాటలకి అందరు ఫిదా అయ్యారు. “అమ్మా! థాంక్యూ. ఈ ఈవెంట్ ఇంత గొప్పగా జరగడానికి కారణం నువ్వే. గత నాలుగు నెలలుగా మా అమ్మ 18-19 గంటలు పనిచేస్తూ, ఈవెంట్‌కి ఏర్పాట్లు చేసింది. థాంక్యూ. ఇక్కడికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు. నేను, రాధికా చాలా సంతోషంగా ఉన్నాము. ఎవరికైనా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించండి. నా తల్లి, తండ్రి, సోదరులు.. కుటుంబసభ్యులందరికి థాంక్యూ. మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు చాలా మంది కష్టపడ్డారు,” అని అనంత్ అంబానీ స్పీచ్‌లో పేర్కొన్నారు.