MP Lavu Srikrishna Devarayalu : ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకుంటూ రాజకీయంపై మరింత ఆసక్తి పెంచుతున్నారు.ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు టీడీపీలోకి వచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీని టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు.
పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. ఈ ఐదేళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనే అని వెల్లడించారు. తాను ఏ వేదికపైనా ఎవరినీ అతిగా పొగిడింది లేదని, ఎవరినీ అనవసరంగా విమర్శించిందీ లేదన్నారు. ఇకపైనా పల్నాడు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండడం తెలిసిందే.

గుంటూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని చెప్పింది. అయితే, అందుకు శ్రీకృష్ణ దేవరాయలు ఒప్పుకోలేదు. ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడాయన టీడీపీ వైపు చూసారు. పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం అయ్యారు. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు. అయితే టీడీపీలో సాగుతున్న శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ నాయకులకి చుక్కలు కనిపించేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.