OTT : ఒకవైపు థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ కూడా సినీ ప్రియులు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడంలో ముందుంటారు. అదే క్రమంలో ఓటీటీలలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న పలు చిత్రాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంతో పాటు పలు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ 5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కానున్న సినిమాలని చూస్తే.. 1899 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ థ్రిల్లర్ కాగా, బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌ను ఈ నెల 17న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం మంచి రివ్యూలని పొందింది కానీ అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రం ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
కార్తీ నటించిన సర్దార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంఇ వసూళ్లు సాధించింది. థ్రిల్లర్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 18న ఆహా వీడియోలో ప్రీమియర్ అవుతుంది. ఇక అహ నా పెళ్లంట ఈ నెల 17న జీ 5లో ప్రీమియర్ అవుతుంది ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది థియేటర్ లో పెద్దగా అలరించలేకపోయింది. మరి ఓటీటీలో ఎంతగా అలరిస్తుందనేది చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…