OTT : థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి మార్చి చివరి వారంలో ప్రేక్షకులని అలరించబోయే చిత్రాలేంటనేది చూస్తే.. శ్రీదేవి శోభన్ బాబు . సంతోష్ శోబన్ మరియు గౌరీ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొంది మంచి విజయం సాధించింది. మార్చి 30వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానుంది.
ఇక బింబిసార వంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం అమిగోస్. ఈ చిత్రం లో త్రిపాత్రాభినయం పోషించాడు కళ్యాణ్. సినిమా కాన్సెప్ట్ తేడా కొట్టడంతో మూవీ బోల్తా పడింది. ఏప్రిల్ 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది. అలా వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డిజాస్టర్‌గా నిలిచింది. ఇది ఏప్రిల్ 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.ఈ ఆహా ఒరిజినల్ లో సత్తిగాని రెండెకరాలు (తెలుగు) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. పుష్ప ఫేమ్ జగదీష్ బండారి ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఇక నెట్ ఫ్లిక్స్ లో క్రైసిస్ (హాలీవుడ్) మార్చి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి , కిల్ బాక్సూన్ (కొరియన్) మార్చి 31 వ తేదీ నుండి, అలానే మర్డర్ మిస్టరీ2 (హాలీవుడ్) మార్చి 31 వ తేదీ నుండి ప్రసారం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది పవర్ (వెబ్‌సిరీస్) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. జీ5 లో అగిలన్ (తమిళ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. అయోధ్య (తమిళం) మార్చి 31 వ తేదీ నుంచి , యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కానుంది.