Mokshagna : ఇప్పటికే స్టార్ హీరో కొడుకులు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ తనయుడి గురించి ఎప్పటి నుండో ప్రచారాలు నడుస్తున్నాయి. ఈయన ఫలానా దర్శకుడి డైరెక్షన్‌లో తెరంగేట్రం చేయనున్నాడని వార్తలు హల్‌చల్ చేస్తుండగా,తాజాగా స్పందించాడు. మోక్షజ్ఞను దర్శకుడు బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ”అంతా దైవేచ్ఛ” అని నవ్వి ఊరుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎంట్రీ అలా జరిగిపోతుందని, ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదని, ఆ సమయం రావాలని, అప్పటివరకూ మనమంతా వెయిట్ చేయాలంటూ బాలయ్య మాట్లాడడంతో ఇప్పుడు అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మోక్షజ్ఞ ఎంట్రీపై గతంలో మీడియాలో చర్చలు కూడా జరిగాయి. మోక్షజ్ఞని బాలయ్యే డైరెక్ట్ చేయనున్నట్టు ప్రచారం జరగగా, దానిపై స్పందించిన బాలయ్య ఎప్పుడు ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు అన్నారు. ఏదేమైన మోక్షజ్ఞ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఎంటీ ఇస్తాడా లేక మరో దర్శకుడితో వస్తాడా అనేది మాత్రం అభిమానులని సస్పెన్స్ లో పడేస్తూనే ఉంది.
బాలకృష్ణ కుమారుడి సినిమా రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నప్పటికీ బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా తొలిసారి కుమారుడి సినిమాపై మాట్లాడి గాసిప్స్ కు చెక్ పెట్టారు అనే చెప్పాలి.. విలేకరులు ఈ ప్రశ్నలు అడిగే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ పక్కనే ఉండగా, ఆ సమయంలో అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఏ దర్శకుడు సెట్ అవుతారో వారే పరిచయం చేస్తారుకానీ నేనే లాంచ్ చేస్తానని గ్యారంటీగా చెప్పలేనన్నారు. ఇక బాలకృష్ణ త్వరలో అఖండ 2 మూవీ కూడా రానుందని తెలియజేయడం విశేషం. ఇ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…