Mokshagna : నాని నిర్మాణంలో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి.విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే ‘హిట్: ది సెకెండ్ కేస్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించగా, ఇందులో . మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.రెండు పార్ట్‌లు మంచి విజయం సాధించడంతో మూడో పార్ట్‌లో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలో ఉండగా, సినిమా క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చారు.
హిట్ 3లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నాడు. అర్జున్ సర్కార్ అనే పాత్రలో ఆయన కనిపించి అలరించనున్నాడు. అయితే హిట్ 2 విషయానికి వస్తే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి మరింత దగ్గరలో ఉంది. సినీ ప్రియులే కాకుండా సెలబ్రిటీలు సైతం మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అడివి శేష్, నేచురల్ స్టార్ నాని.. నందమూరి బాలకృష్ణ హిట్ 2 చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించగా, ఆ సమయంలో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా హిట్ 2 చిత్రాన్ని చూశాడు. ఈ విషయాన్ని అడివి శేష్ సోషల్ మీడియా తెలిపాడు.
అడివి శేష్ ట్వీట్ చేస్తూ.. ‘బాలయ్య సర్ కి హిట్ 2 సూపర్ గా నచ్చింది. నా పెర్ఫామెన్స్ గురించి, దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఆయన ఎంతగానో ప్రశంసించారు. హిట్ సిరీస్ లో కామియో రోల్ ప్లే చేయాలని నేను బాలయ్య సర్ ని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి.. ఏమో ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. నందమూరి మోక్షజ్ఞ చాలా స్వీట్ కిడ్ . మోక్షజ్ఞకి హిట్ 2 చాలా బాగా నచ్చింది’ అంటూ అడివి శేష్ తన ట్వీట్‌లో పర్కొన్నారు. ఇక సినిమాను బాగా ఎంజాయ్ చేసిన బాలకృష్ణ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. అల్టిమేట్ థ్రిల్లర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…