Renu Desai : ఒకప్పటి స్టార్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణూ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే ఆదివారం రేణూ బర్త్ డే కావడంతో చాలా కాలం తరవాత ఒక సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా సెట్స్‌లో రేణు దేశాయ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో రేణు దేశాయ్ కేక్ కట్ చేశారు. ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. రేణు దేశాయ్ కేక్ కట్ చేస్తున్న ఫొటోలను సైతం షేర్ చేసింది. ఆమె పోషిస్తోన్న హేమలత లవణం పాత్ర చాలాకాలం గుర్తుండిపోతుందని పేర్కొంది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. . సుమారు 19 ఏళ్ల తరవాత రేణు దేశాయ్ ఈ సినిమా ద్వారా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. సంఘసంస్కర్త, రచయిత్రి అయిన హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుండగా, ఈ పాత్ర రేణు దేశాయ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుందట. ఇక రేణు దేశాయ్ ఆదివారంతో 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో అభిమానులు, సెలెబ్రిటీలు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రేణు దేశాయ్ ఇకపై మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకున్నారు.
టైగర్ నాగేశ్వరరావు పేరుమోసిన స్టువర్ట్‌పురం దొంగ. ఆయన బయోపిక్‌గా 70ల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా మేకోవర్ కాగా, ఇందులో డిక్షన్, డైలాగ్ డెలవరీ, గెటప్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటూ, మునుపెన్నడూ కనిపించని పాత్రలో రవితేజ కనిపించనున్నాడట. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ గత చిత్రాలు ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…