Mohan Babu : సీనియర్ హీరో మోహన్ బాబు గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. 90వ దశకంలో పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.నట ప్రపూర్ణ గా కూడా బిరుదు అందుకున్నారు. ఇప్పటికీ సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్న కూడా అంత సక్సెస్ కావడం లేదు. మంచు మోహన్ బాబు సినిమాలతో పాటు గతంలో రాజకీయకాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు.
ముఖ్యంగా 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఆయన పేరును రాజకీయంగా పలువురు వాడుకుంటున్నారనే విషయం ఆయనకు తెలిసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తే ఏం చేస్తారో కూడా ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్ బాబు సంచలన లేఖ విడుదల చేశారు. తన పేరును రాజకీయాలకు వాడుకోవద్దని పార్టీలకు సూచిస్తూనే.. అలాంటి పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు.
ఈ మధ్య కాలంలో తన పేరును ఉపయోగించుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న మోహన్ బాబు.. ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అలాగే మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామనీ.. ఎవరి అభిప్రాయాలు వారివని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్న మోహన్ బాబు.. అది వారి వారి వ్యక్తిగతమని లేఖలో పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టిపెట్టాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని అన్నారు. తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నానన్న మోహన్ బాబు.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…