Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తూటాల్లాంటి మాటలతో ఒక్కోసారి హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాడనే సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఆ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తన కుమారుడి పెళ్లి తనకు ఇష్టం లేదని కొందరు ప్రచారాలు చేయడంతో దానిపై ఘాటుగా స్పందించారు. మంచు మనోజ్-భూమా మౌనికాల పెళ్లి న్యూస్ కొద్ది రోజుల క్రితం ఎంత హాట్ టాపిక్ అయిందో మనం చూశాం. మార్చి 3న వీరిద్దరు వివాహం చేసుకోగా, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది.
అయితే వారి పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకోలేదని, ఆ పెళ్లికి ఆయన హాజరుకారు అని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. మనోజ్- మౌనికల పెళ్లికి హాజరై వధూవరులిద్దరిని ఆశీర్వదించారు మోహన్ బాబు. మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే చెప్పాడు. అయితే నేను ఓ సారి ఆలోచించు అన్నాను. దాంతో ఆ నిర్ణయం సరైనదేనని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అన్నాను అంతే. ఇక ఎవడో ఏదో అనుకుంటాడు అని మనం చేసే పని ఆపకూడదు” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
రూమర్స్ గురించి స్పందించిన మోహన్ బాబు.. ఏనుగు దారిపై వెళ్తుంటే.. దాని వెనకాల ఎన్నో కుక్కలు మెురుగుతాయి, మనం ఎన్ని కుక్కలను అపుతాం.. ఇక మెురిగే కుక్కలను నువ్వు మెురగనివ్వు అంటూ.. వారిని కుక్కలతో పోల్చారు. ఇక అలాంటి వారిని పట్టించుకోకుండా నువ్వు నీ దారిలో వెళ్తే.. నువ్వు గొప్పోడివి అవుతావు అంటూ చెప్పుకొచ్చారు. ఇక భూమా కుటుంబంతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పటి నుంచో భూమా నాగిరెడ్డి కుటుంబం తెలుసు.. వాళ్లు చాలా మంచివాళ్లు. డోంట్ గో డీప్. వివాహం చేసుకున్నారు..ఏవేవో ప్రశ్నలు వేయకుండా.. శుభంగా ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…