Mohan Babu : బుద్ది లేని వారే కులాల‌ని విడ‌గొడ‌తారు అంటూ మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mohan Babu : తిరుపతిలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి డాక్టర్ మంచు మోహన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం వచ్చిందన్నారు.ఇవాళ నేను ఏం మాట్లాడినా అది అతిశయోక్తి అనుకుంటారు. కానీ, నేను చెప్పేది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఈ మాత్రం ధైర్యంగా మనం భారతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోలుగుతున్నాం అంటే అందుకు కారణం ప్రధాని మోడీ ఒక్కరే. ఆయన లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి’ మోహన్ బాబు పేర్కొన్నారు.

మనం ఉన్న పరిస్థితుల్లో కులాలు ఏవీ లేవు. అందరూ ఒకటేనని ముందుకెళుతుంటే.. తెలిసో తెలియకో కొందరు అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ, మన ప్రధాని మనమందరం ఒక్కటే అని చాటేలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. అక్కడ అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మోడీ చేస్తున్నవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు జీవించాలని, ఎల్లప్పుడూ ఆయన మనకు ప్రధానిగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

Mohan Babu sensational comments on ap
Mohan Babu

మోదీ ప్రధాని కాకముందే ఆయనను మేం కుటుంబ సమేతంగా పార్క్ హయత్ హోటల్ లో కలిశాం. సార్.. మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నాం అని చెప్పాం. అందుకాయన స్పందిస్తూ.. ఎందుకు? అన్నారు. దాంతో కొన్ని అంశాలను ఆయనకు వివరించాం. దాంతో ఆయన సంతృప్తి చెంది.. నువ్వు నిజమైన కళాకారుడివి అని అభినందించారు. దేవుడి దయ ఎలా ఉందో.. చూద్దాం అని అన్నారు. ఆ విధంగా ఆయన రెండు పర్యాయాలు విజయాలు సాధించారు. ఆయన మూడోసారి కూడా గెలుస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు” అంటూ స్పందించారు. “రామ మందిరం ప్రారంభోత్సవానికి చాలామంది వస్తున్నారు. అంతమంది మధ్యలో నేను తట్టుకోగలనో, లేదో.. వెళ్లాలని మనసులో సంకల్పం ఉంది.. హనుమంతుడి ఆశీస్సులు, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది” అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago