Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఒక సంచలనం. ఆయన టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. అయితే చివరి వారాల్లో అంచనాలు తారుమారు అయ్యాయి. పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో రేసులోకి దూసుకు వచ్చాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినందుకు తనకు సంతోషమే అని శివాజీ అన్నాడు. ఇక నటనకు దూరమైన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. నైంటీస్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు. కాగా శివాజీ పాలిటిక్స్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో అతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. పాలిటిక్స్ వెళ్ళాక డబ్బులు సంపాదించారని టాక్ దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా… నేను ఈ పార్టీ దగ్గర చేయి చాచి అడుక్కోలేదు. అలా నేను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే చచ్చిపోతాను, అని శివాజీ అన్నాడు.
చంద్రబాబు నాయుడికి వీరవిధేయుడు, భక్తుడు శివాజీ. చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకుని భక్తిని చాటుకున్నారు కానీ.. అదే శివాజీ అయితే అర్ధనగ్న ప్రదర్శనో.. అంతకు మించిన ప్రదర్శనో చేసేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్‌ని మించి భక్తి శివాజీకి. అయితే ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టు తెలిస్తే మీరు బయటకు వచ్చేవారా అని ప్రశ్న అడగగా, మే బీ వచ్చే వాడినేమో అని అన్నారు.
ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు అని కూడా శివాజి అన్నారు. ప్రజలకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన ఏం సంపాదించారో నాకు అనవసరం. ప్రజల వెన్నంట ఉన్నారు అని అన్నాడు శివాజి. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌లో మెచ్యూర్డ్ గేమ్‌తో ఆకట్టుకుంటున్నాడు శివాజీ.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నాడంటే.. హా.. ఇతను వారం కంటే ఎక్కువ ఉండడులే అనుకున్నారు చాలామంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు శివాజీ. తనలోని అన్ని షేడ్స్‌ని స్టెప్ బై స్టెప్ చూపించాడు. మంచికి మంచి పంచ్‌కి పంచ్ అనేట్టుగా హౌస్‌లో అల్లాడించాడు శివాజీ. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లకు ముందు ఓలెక్క.. బిగ్ బాస్‌కి వెళ్లిన తరువాత మరోలెక్క అన్నట్టుగా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు శివాజి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…