Mohan Babu : ధ‌ర్మం వైపే నా స‌పోర్ట్ అంటూ మ‌నోజ్‌కి పెద్ద షాక్ ఇచ్చిన మోహ‌న్ బాబు

Mohan Babu : ఎప్పుడు క‌లిసి క‌ట్టుగా ఉంటూ ఇత‌రుల‌పై దాడి చేసే మంచు బ్ర‌ద‌ర్స్ ఈ సారి వారిలో వారే గొడ‌వ‌ప‌డ్డారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడం ఒక్కసారిగా జనాల్లో హాట్ టాపిక్ అయింది. మంచు సోదరులైన విష్ణు, మనోజ్ మధ్య రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు సోషల్ మీడియాలో ట్రెండ్ కావ‌డంతో ఈ గొడ‌వ ర‌చ్చకెక్కింది. తమ దగ్గర చాలా ఏళ్ల పాటు పనిచేసిన సమీప బంధువు సారథిపై విష్ణు చేయి చేసుకున్న వీడియోను స్టేటస్‌గా పెట్టిన మనోజ్.. ఇద్దరి మధ్య నానుతున్న‌ వివాదాన్ని పబ్లిక్‌లో పెట్టాడు.

మోహన్ బాబు ఎంట్రీతో వివాదం సద్దుమణిగిన‌ట్టు క‌నిపిస్తున్నా కూడా లోలోప‌ల ఏదో జ‌రుగుతుంద‌నే అనుమానాలు లేవ‌నెత్తుతున్నారు. గొడ‌వ జ‌రిగిన త‌ర్వాత మంచు విష్ణు స్పందిస్తూ.. ఇది చిన్నగొడ‌వే అని అన్నారు. ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. దీనిని కొంద‌రు త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్నారు. అన్నదమ్ముల గొడవ త్వరలోనే పరిష్కారం అవుతుంది, అన్నారు. అయితే మ‌నోజ్.. వీడియో పోస్ట్ చేసి డిలీట్ చేసిన త‌ర్వాత మీరు బ్రతకండి మమ్మల్ని బ్రతకనీయండి అంటూ.. కొటేషన్స్ షేర్ చేశారు. దీంతో మనోజ్ ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు అన్న‌ట్టుగా కొంద‌రు భావించారు.

Mohan Babu given support to manchu vishnu
Mohan Babu

అయితే మంచు ఫ్యామిలీ గొడ‌వ నేప‌థ్యంలో మోహన్ బాబు పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సదరు వీడియోలో మోహన్ బాబు తన స‌పోర్ట్‌.. విష్ణుకే మనోజ్ కి కాదని చెప్పాడు. గతంలో టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరగ‌గా, అందులో విష్ణు, మనోజ్ రెండు టీమ్స్ కి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు మీరు ఎవరి వైపని మోహన్ బాబుని అడగ్గా… నేనెప్పుడూ ధర్మం, న్యాయం వైపే ఉంటాను. నిజంగా ఇక్కడ కష్టపడింది విష్ణు టీమ్. మనోజ్ టీమ్ కాదు.. అని చెప్పుకొచ్చారు. దానికి పక్కనే ఉన్న తమ్మారెడ్డి.. వ‌న్ సైడ‌ర్‌గా చెప్తే ఎలా అని అన్నాడు. దానికి నేను జీవితంలో ఎన్నడూ వన్ సైడెడ్ గా లేనని అన్నారు. అదే కాక వారిద్ద‌రి సినిమాలు చూసుకున్నా కూడా మ‌నోజ్‌కి పెద్ద‌గా మోహ‌న్ బాబు నుండి పెద్ద‌గా స‌పోర్ట్ ల‌భించ‌లేద‌ని అంటున్నారు. మనోజ్ కంటే పెద్ద కొడుకు విష్ణు మీద ఆయనకు మమకారం ఎక్కువగా కనిపిస్తుంద‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago