MLA Madanmohan Rao : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం మంచి విజయం సాధించిన విషయం తెలిసందే. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, బీజేపీ అభ్యర్థి వి సుభాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారిపై గెలిచి ఎమ్యెల్యేగా పదవి బాధ్యతలు అందుకున్నారు మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా చేస్తే బాగుండని పలువురు సూచించారు. మదన్ మోహన్ రావు ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడని.. యూఎస్ ఎం బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడని చెబుతున్నారు. ఐటీ మంత్రి మంత్రిత్వశాఖకు ఆయన సరైన వ్యక్తని, ఉన్నత విద్యావంతుడని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ దండిగా ఉన్నాయని కేటీఆర్ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడని చెప్పుకొచ్చారు. అయితే శ్రీధర్ బాబుని ఐటీ మంత్రిగా నియమించారు.
అయితే ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ నడుస్తుండగా, మదన్ మోహన్ రావు తనదైన శైలిలో అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ అలానే హరీష్ రావుకే చెమటలు పట్టించేలా మాట్లాడాడు. శ్వేతపత్రంలో అన్ని విషయాలు దాగి ఉన్నాయని, మీరు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారో దీనితో అర్ధమవుతుందని ఆయన అన్నారు. హరీష్ రావు మాట్లాడకుండా అడ్డుపడుతున్న సమయంలో ఆయనపై గట్టిగానే అరిచారు. ఇప్పుడు అందరి దృష్టి మదన్ మోహన్ రావుపైనే పడింది. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో కేవలం 11 మంది మాత్రమే వున్నారు… కాబట్టి మరో ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం వుంది.
కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ వుంటుందని… అప్పుడు అతనికి మంచి పదవి అప్పగించే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. మదన్ మోహన్ రావు ఐటీ రంగంలో కొనసాగి రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు విదేశాల్లో ఐటీ కంపనీలను నడిపిస్తున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ టీంలో ఐటీ పరంగా సేవలందించారు. ఇలా ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉంది.