Mangoes Funny Dubbing : తెలుగోళ్లకు తెలివి ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి పోయినా బతుకుతారు అని పలువురు పలు మార్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య మన తెలుగోళ్లు వేరే భాషలకి చెందిన వీడియోలకి మన భాషలో డబ్బింగ్ చెప్పి అదరహో అనిపిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర భాషలలో వారు డబ్బింగ్ చెప్పే విధానం చూస్తే ఎవరికి అయిన కడుపుబ్బ నవ్వు రాక మానదు. ఆ మధ్య క్రికెటర్స్ సంభాషిస్తున్నప్పుడు కూడా ఫన్నీ డబ్బింగ్ చేసి వీడియో షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అయింది. వెరైటీ వీడియోలకి మన భాషలలో చెప్పే ఫన్నీ డబ్బింగ్ మాత్రం ఔరా అనిపిస్తుంది.
రీసెంట్‌గా మామిడికాయల దొంగతనం డబ్బింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇది చాలా ఫన్నీగా ఉండడంతో పాటు నెటిజన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. ఇందులో డబ్లూడబ్ల్యూఎఫ్‌కి సంబంధించిన క్రీడాకారులు ఉండగా వారి మధ్య జరిగిన సంభాషణకి డబ్బింగ్ తెలుగులో ఫన్నీగా చెప్పుకొచ్చారు. మామిడి కాయల దొంగతనం కోసం వెళదామని ఓ వ్యక్తి మరో వ్యక్తికి చెబుతున్నట్టుగా వీడియోలో ఉంది. మామిడికాయలు పీక్కొద్దాం పదా.. చిక్కుతే చిక్కుతాం .. అంతే కదా అని అంటాడు. అప్పుడు నేను రాను అని అంటాడు అవతలి వ్యక్తి. అప్పుడు నేను ఉన్నా నీకెం భయం అని అంటాడు.
అప్పుడు నువ్వు ఉన్నావనే నాకు భయం అని అంటాడు. అంతకముందు పలు తోటలలోకి తీసుకెళితే ఫుల్ కొట్టుడు కొట్టారు. వాతలు పెట్టారు. గుద్దులు గుద్దారు. అరేయ్ ఏం కాదు.. నేనొక బస్తా, నువ్వొక బస్తా తెచ్చుకుందాం పద. ఏమి కాదు అని అంటాడు. అప్పుడు మరో వ్యక్తి నేను అయితే రాను అని చెబుతాడు. అప్పుడు ఒకసారి కాయలు తెచ్చాక నా ఇంటి ముందుకు వచ్చి ఒక కాయ ఇవ్వమని అడుగు, అప్పుడు చెబుతాను అంటూ ఆవేశంగా చెబుతాడు. మొత్తానికి ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ అందుకు సంబంధించిన డబ్బింగ్ ఆకట్టుకునేలా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…