Manchu Vishnu : సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. మోహన్ బాబు వలన మంచు ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దానిని మంచు హీరోలు నిలబెట్టలేకపోయారు. విష్ణు, మనోజ్ పలు సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ కాకపోవడంతో వారి కెరియర్ సజావుగా సాగడం లేదు. అయితే మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా. రైటర్ కోన వెంకట్, డైరెక్టర్ సూర్య కాంబినేషన్‌లో పని చేస్తున్నారు. కాగా ఈ టీజర్ రీసెంట్‌గా విడుదల కాగా ఈ కార్యక్రమంలో మంచు విష్ణు పలు క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వలన ఆయనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈవెంట్‌లో విష్ణు మాట్లాడుతూ.. జిన్నా నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. వాళ్ళతో పాడించినందుకు బిగ్ థాంక్స్. మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబాయ్ అని పిలిస్తే, నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. ఢీ ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా.. అని అన్నారు. అయితే ప్రెస్ మీట్‌లో మంచు విష్ణు కన్నా సన్నీ లియోన్‌నే ఎక్కువ ప్రశ్నలు వేశారు.
ఈ క్రమంలోనే ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా..? అని అడగ్గా సన్ని లియోన్ మాట్లాడుతూ.. అఫ్ కోర్స్ ఇది చాలా కొత్త.. డిఫరెంట్ కదా.. స్టోరీలో ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. ఇలాంటి కథను చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయనలో మంచి నటుడు ఉన్నారు అని సన్నీలియోన్ చెబుతుండగా, మధ్యలో నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని సన్నీలియోన్ ని అడిగాడు విష్ణు. దీనికి సన్నీలియోన్ కూడా కాస్త షాక్ అయి.. మంచు విష్ణు చాలా నాటీ.. మీకు తెలిసి ఉంటుంది కదా.. అంటూ కవర్ చేసుకొచ్చింది. మంచు విష్ణు ప్రవర్తనపై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…