Manchu Manoj : ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక.. పెళ్లి ఫొటోలు వైర‌ల్..

Manchu Manoj : గ‌త కొద్ది రోజులుగా మంచు మ‌నోజ్, భూమా మౌనిక‌ల పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు అది నిజ‌మేన‌ని అన‌గా, మ‌రి కొంద‌రు రూమ‌ర్ అంటూ కొట్టి ప‌డేసారు. ఎట్ట‌కేల‌కు ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌.బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం.ఈ వివాహ వేడుకలో మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య పిల్లలతో కలిసి పాల్గొన్నారు. నిజానికి ఈ పెళ్లి మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ఇష్టం లేదని.. వారు వివాహ వేడుకకు హాజరుకావడం లేదని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారంలో నిజం లేదని మంచు విష్ణు, మోహ‌న్ బాబు రాకతో తేలిపోయింది.

ఇక బంగారు వర్ణంలో ఉన్న వస్త్రాల్లో నవదంపతులు ఇద్దరూ మెరిసిపోతున్నారు. ఓ ఫొటోలో మౌనికకి మనోజ్ ప్రేమగా ముద్దు ఇవ్వడం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ ఇద్ద‌రికి ఇది రెండో పెళ్లి కాగా, ఇద్దరూ రెండు బలమైన కుటుంబాల నుంచి రావడంతో వీరి వివాహం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ వివాహ వేడుకకు పెళ్లి పెద్దగా మనోజ్ సోదరి మంచు లక్ష్మి వ్యవహరించారు. తన ఇంట్లోనే తమ్ముడికి పెళ్లి చేశారు. ఈరోజు సాయంత్రం మనోజ్‌ను పెళ్లికొడుకును చేసిన లక్ష్మీప్రసన్న.. వరుడి ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Manchu Manoj finally married bhuma mounika reddy photos viral
Manchu Manoj

అయితే అక్క గురించి కాస్త ఎమోషనల్ అయ్యారు మ‌నోజ్. తనకు దగ్గరుండి పెళ్లిచేయడాన్ని ఉద్దేశించి.. ‘అక్కా, ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యు అక్క. నువ్వే నా కోసం ఇంత చేస్తున్నావు.. థాంక్యూ’ అని మనోజ్ రాసుకొచ్చారు. ఇక 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకోగా, కొన్ని రోజులకే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో ఇద్దరూ విడిపోయారు. ఇక భూమా మౌనికకి కూడా ఇది రెండో పెళ్లి కాగా, గ‌తంలో బెంగుళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కాని ఏవో కార‌ణాల వ‌ల‌న విడిపోయారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago