Venkatesh : భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడుతో స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా వున్నారు. సురేష్ బాబు తనయుడు రానాతో కలసి నటిస్తున్న తొలి ప్రాజెక్ట్. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వెంకటేష్, ఈ సిరీస్‌లో నాగనాయుడు పాత్రలో కనిపించనున్నారు. తన అబ్బాయితో తలపడే పాత్రది. తండ్రి, కొడుకులుగా ఇద్దరూ పోటాపోటీ పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా,ఇందులో వెంకీ బూతులు మాట్లాడుతూ కొన్ని ఎబెట్టు సన్నివేశాలు కూడా చేసినట్టు అర్ధమైంది.
తాజాగా ఆ బూతులు గురించి వెంకటేష్ నోరు విప్పారు . హిందీలో బూతులు పలికేటప్పుడు ఏమంత ఇబ్బంది అనిపించలేదు, కాని తెలుగులో మాత్రం తన ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకులని ఇలాంటివి కొంత తగ్గించమని కోరాను అని వెంకీ చెప్పారు. ఇక తర్వాత దీనికి సంబంధించి సిరీస్‌లు ఏమైన చేస్తారా అంటే అందుకు రానా ఓకే అన్నారు. అయితే ఇది ఇప్పటివరకు నాకు ఒక ఎక్సయిటింగ్ ప్రయాణం. సిరీస్‌లో పనిచేయడానికి, ఒక చిత్రంలో పనిచేయడానికి చాలా తేడా వుంటుంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంది అని వెంకటేష్ అన్నారు.
“సంక్లిష్టమైన పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. రానా నాయుడు లో చేసింది కూడా అలాంటి పాత్రే. పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం వున్న పాత్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ ఈ పాత్ర తృప్తిని ఇచ్చింది” అని వెంకీ తెలిపారు. రానా నాయుడు లో వెంకటేష్ ని ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని పాత్రలో ఆయన్ని చూస్తారు. గ్రిప్పింగ్ కథాంశం, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ ఫార్మెన్స్ కోసం, మంచి క్రైమ్ డ్రామాను ఇష్టపడే అందరూ తప్పక ఈ సిరిస్ చూడాలి. నాగా తన కుటుంబంతో తిరిగి కలవగలడా లేదా అతను తన కొడుకు రానా అంతిమ ప్రత్యర్థి అని నిరూపిస్తాడా? మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే రాబోయే రానా నాయుడు సిరిస్ ద్వారా అర్ధమవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…