Manchu Lakshmi : టాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచు మోహన్ బాబు హీరోగా, విలన్‌గా ఎన్నో ముఖ్యమైన పాత్రలు పోషించగా,ఆయన వారసులుగా మంచు విష్ణు, మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వారు అనుకున్న రీతిలో విజయాలు సాధించలేకపోయారు. అయితే కొంత కాలంగా వివాదలతో మంచు ఫ్యామిలీ వార్తలలో నిలుస్తుంది. ఆ ఫ్యామిలీలో విబేదాలు ఎక్కువయ్యాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. మంచు మనోజ్ వ్యవహారంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు బాగా పెరిగాయనే ప్రచారం జరుగుతోంది.
మనోజ్ నంద్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమి అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డిని పెళ్లాడనున్నాడని, గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నారిని, ఈ పెళ్లికి మంచు ఫ్యామిలీ ససేమిరా అంటోందని సమాచారం. ఈ క్రమంలోనే మంచు కుటుంబ సభ్యులకు మనోజ్‌కు మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయిలో పెరిగాయని పుకార్లు కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై తాజాగా మంచు లక్ష్మీ స్పందించింది. తమ ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు.
తమ కుటుంబంలో విభేదాలు జరిగి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని వినిపిస్తున్న వార్తలపై మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “మా కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ మా పర్సనల్. ఎందుకంటే మేమెప్పుడూ కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వలన కలవలేకపోతున్నాం. విష్ణుకు ఫ్యామిలీ, పిల్లలు, బిజినెస్ వాటికే టైమ్ సరిపోతుంది. ఇక ఎక్కువగా నేను, మనోజ్ టైమ్ స్పెండ్ చేస్తాం. అందుకే ఎక్కడైనా మేమిద్దరమే కనిపిస్తాం.” అంటూ చెప్పుకొస్తూ… మంచు లక్ష్మీ తమ ఫ్యామిలీపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…