Manchu Lakshmi : టాలీవుడ్‌లో ఉండే బిగ్ ఫ్యామిలీస్‌లో ఎక్కువగా వివాదాలతో వార్తలతో నిలిచే ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ హీరోలు ఎప్పుడు ఏదో ఒక సమస్యతోనో లేదంటే ట్రోల్స్‌తోనో హాట్ టాపిక్ అవుతుంటారు. మంచు మోహన్ బాబు కుమారులు అయిన మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లుగా గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందుకే మంచు మనోజ్ రెండో వివాహానికి కూడా విష్ణు హాజరు కాలేదనే టాక్ కూడా వినిపించింది. ఈ క్రమంలోనే మనోజ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. తన మనిషి అయిన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేసేందుకు వచ్చినట్లుగా మనోజ్ తెలిపాడు. వీడియోలో “నా ఇష్టం.. వాడేదో అంటున్నాడు కదా..” అని విష్ణు అంటున్నాడు. మరోవైపు “ఇదండి అసలు విషయం.. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు” అని మనోజ్ చెప్పుకొచ్చాడు. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అసలు ఇద్దరికి ఏమైంది అని ముచ్చటిస్తున్న క్రమంలో మంచు లక్ష్మీ స్పందించింది.
ఇది అందరి ఇళ్లలో జరిగే గొడవే అని, దీనిని ఇంటి గొడవగానే పరిగణించాలి. దీనిపై అనవసర రాద్దాంతం చేయాల్సిన పనిలేదు. త్వలోనే ఇద్దరి మధ్య గొడవ పరిష్కారం అవుతుందని పేర్కొంది మంచు లక్ష్మీ.ఇప్పటివరకు గుట్టుగా ఉన్న మంచు ఫ్యామిలీ విభేదాలు పబ్లిక్ లోకి వచ్చేశాయి.దీంతో కొడుకులపై మోహన్ బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కుటుంబంలో జరిగే గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఫేస్ బుక్ పోస్ట్ ను డిలీట్ చేయాలని మంచు మనోజ్ ను ఆదేశించడంతో మనోజ్ వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశాడని చెప్పుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…