Manchu Lakshmi : మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె విదేశాలలో చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక్కడకి వచ్చాక నటిగా, హోస్ట్‌గా కూడా తన టాలెంట్ చూపించింది. అయితే మంచు లక్ష్మీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె చేసిన నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మీ .టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్యను అందించేందుకు దత్తత తీసుకునేందుకు ఆ సంస్థ ఫౌండర్, సినీనటి లక్ష్మీ మంచు ముందుకు వచ్చారు.
గద్వాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మంచు లక్ష్మి సమావేశమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళిక వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఆయా పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం ఇప్పటికే మెటీరియల్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకొని ఇప్పటికే విజయవంతం చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాలను ఎంచుకొని ఈ కార్యక్రమాలు తమ స్వచ్చంద సంస్థ ద్వారా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా గద్వాల జిల్లాకు రావడం జరిగిందన్నారు. 2014లో స్థాపించబడిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్‌షిప్ వాలంటీర్ ప్రొగ్రామ్, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42 ,080 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్దిపొందుతున్నారని మంచు లక్ష్మి తెలియజేశారు. అయితే మంచు లక్ష్మీ తెలుగు మాట్లాడిన తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…