Trivikram Srinivas : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన ఇటీవలి కాలంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న మహేష్ రీసెంట్‌గా సర్కారు వారి పాట చిత్రంతో పలకరించాడు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు మహేష్. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అది పక్కా కల్ట్ క్లాసిక్ అని ప్రేక్షకులు భావిస్తంటారు.
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్ సాధించకపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఫైట్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టినట్టు తెలుస్తుండగా, ఇందులో మహేష్ రఫ్ లుక్ లో కనిపించనున్నాడట. అయితే చిత్రానికి పార్థు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాంతో పాటు అర్జునుడు లేదా అసుర సంధ్య వేళలో అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
అర్జునుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు రావడంతో కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నారట. అందుకు కారణం గతంలో మహేష్ బాబు నటించిన అర్జున్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి మళ్లీ అలాంటి టైటిల్‌తో సినిమా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి సింపుల్ టైటిల్ ఎలా పెడతావ్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. మరి అతి త్వరలోనే త్రివిక్రమ్ అయితే ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇవ్వనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…