Mahesh Babu : ఏ తండ్రికైన కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడే ఆనందం అనే నానుడి ఉన్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు తండ్రిగా గర్వపడుతున్నాడు. తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేశ్.. ‘నా మనసు గర్వంతో నిండిపోయింది. నీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు. నీ జీవితంలో తరువాతి పాఠం నువ్వే రాసుకోవాలి. నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను. నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అని మహేష్ రాసుకొచ్చారు.
ఇక నమ్రత ‘మై డీయర్ జీజీ.. నీ లైఫ్ లో కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు.. ఈ రోజు నేను నిన్ను చూసి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నా.. నీ జీవితంలో ఎప్పటికీ నిజాయితీతో ఉండు.. నీ కలల సాకారం చేసుకోవడానికి ముందుకు సాగు.. మేము నీ ఆనందం కోరుకుంటున్నాం.. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లినా.. మా ప్రేమ నీతో ఉంటుంది. ఈ ప్రపంచం ఇక నీదే.. లవ్ యూ సోమచ్’ అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి పుత్రోత్సాహంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గౌతమ్ ముందు ముందు గొప్ప పొజీషన్ కి చేరుకోవాలని వారి తపన చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక మష్ బాబు సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. సినిమా ఉందని ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే సైలెంట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ దుబాయ్ లో వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం బాడీని, జుట్టుని పెంచుతున్నాడు. ఇటీవల జుట్టు బాగా పెంచి, గడ్డం పెంచి, మంచి బాడీ తో కనపడిన మహేష్ ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…