Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వేణు స్వామి జాతకాన్ని నమ్మే ఎంతో మంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు. కొంతమంది వేణు స్వామి జాతకం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ చాలామంది హీరోయిన్లు మాత్రం తమ కెరియర్ బాగుండాలని ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు. అనన్య నాగళ్ళ, అషు రెడ్డి వంటి ప్రముఖులతో పాటు రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించిన వాళ్లే.ఇక వేణు స్వామి రాజకీయ నాయకుల గురించి కూడా జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.
వేణు స్వామి.ఏదో ఒక విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు ఈయన. మొత్తానికి ఏదో జరగబోతోంది అని హింట్ ఇస్తూ హడావుడి చేసేస్తుంటారు. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశంపై అభ్యర్థుల్లోనూ ఓటు వేసిన ప్రజల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయంపై కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వేణు స్వామి. లక్ష సర్వేలు వచ్చినా, ఎంతమంది ఏకమై వచ్చినా ఏపీలో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కుతాయని మళ్లీ సీఎం గా జగన్ ఉంటారని తేల్చిచెప్పేశారు.
2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మూడేళ్ల పాటు సైలెంట్‌గా ఉండాలని సలహా ఇచ్చానని వేణు స్వామి చెప్పారు. చివరి రెండేళ్లలో మాత్రమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పానంటూ గుర్తు చేశారు. జగన్ సీఎం కుర్చీలో కూర్చుంది మొదలు ప్రభుత్వం పడిపోతుందంటూ టీడీపీ ప్రచారం చేసిందని ఆ తప్పుడు ప్రచారమే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయ్యిందని అన్నారు. ఇక ఓ పార్టీ రెండు సార్లు తన దగ్గరకు వచ్చి పంచాంగ శ్రవణం చేయాలి, మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాలని అన్నారు. మీకు పది లక్షలు ఇస్తామని కూడా అన్నారు. పది లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చిన నేను చెప్పనని అన్నట్టు వేణు స్వామి చెప్పారని ఆయన తెలియజేశారు. సీఎంని ముందు పెట్టుకొని నువ్వు సీఎం దిగిపోతే ఎంత కోపం వస్తది. అలాంటి పరిస్థితి నాకు వద్దు. సీఎం ముందు సీఎం కావని నేను చెప్పను అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…