Mahesh Babu : అభిమానుల ఆకలి తీర్చిన మహేష్ బాబు.. దుఃఖంలోనూ ప్రేమ కురిపించిన సూపర్ స్టార్..

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానుల కోసం మహేష్ బాబు భోజన ఏర్పాట్లు చేశారు.

నిన్న మధ్యాహ్నం నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. అయితే, అప్పటికే కృష్ణ ఇంటి వద్దకు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. కానీ, అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అభిమానుల కోసం నిన్న ఉదయం గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ భౌతికకాయాన్ని తరలిస్తామని మొదట ఘట్టమనేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ, మంగళవారం సూర్యాస్తమయం కావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉదయాన్నే పద్మాలయ స్టూడియోకి తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. దీంతో గచ్చిబౌలి స్టేడియం వద్ద వేచి ఉన్న అభిమానులు సైతం కృష్ణ ఇంటికి, పద్మాలయ స్టూడియోకి చేరుకున్నారు.

Mahesh Babu arranges food for his fans
Mahesh Babu

కొన్ని గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు. అయితే, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వారు భోజనం కోసం ఇబ్బంది పడకూడదని భావించిన మహేష్ బాబు భోజన ఏర్పాట్లు చేశారు. విజయకృష్ణ నిలయం వద్ద బయట అభిమానులకు భోజనాలు పెట్టారు. ఉదయం నుంచీ ఏమీ తినలేదని.. మా మహేష్ బాబు భోజనం పెట్టడంతో ఇప్పుడు తింటున్నామని రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులు చెప్పారు. అంత విషాదంలోనూ మహేష్ బాబు మా ఆకలి తీర్చారు అని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసించారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago