OTT : కరోనా సమయం నుండి ఓటీటీకి ఎంత డిమాండ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిలో పలు సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ షోస్ స్ట్రీమింగ్ అవుతుండడంతో వీటిపై తెగ దృష్టి సారిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్, సోని లివ్‌లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతుండగా, ఈ వారం ఏయే సినిమాలు విడుదల అవుతాయా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ముందుగా చూస్తూ.. లవ్ టుడే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించగా, ఈ చిత్రం యూత్ ఫుల్ లవ్ డ్రామాగా రూపొందింది. డిసెంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
టాలీవుడ్‌లో మంచి అభిమానాన్ని పోందిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కు నాన్నగా అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఆధునిక జీవనశైలి, ఆర్థిక సంబంధాలు మనుషుల మధ్య దూరాన్ని ఎలా పెంచుతున్నాయనే పాయింట్‌తో దర్శకుడు వికాస్ భల్ గుడ్ బై సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో అక్టోబర్ 7న రిలీజైన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. వచ్చే నెల (డిసెంబర్) 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇక మోహన్ లాల్ నటించిన మాన్‌స్టర్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫ్రెడ్డీ అనే హిందీ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇండియా లాక్ డౌన్ అనే డ్రామా సిరీస్ డిసెంబర్ 2 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఇండియాలో లాక్ డౌన్‌కి సంబంధించి రూపొందగా, దీనికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…