KTR : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అందువ‌ల్లే ఓడిపోయాం అంటూ కార‌ణాలు చెప్పిన కేటీఆర్

KTR : ఈ సారి తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌లు ఎంత ఆస‌క్తిక‌రంగా మారాయో మ‌నం చూశాం. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌గా, లోక్ స‌భ ఎన్నిక‌లలో కూడా ఆ పార్టీకే విజ‌య‌వ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ పై అంద‌రు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే తాము రెండు కారణాల చేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం.

కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రుణమాఫీ విషయంలో రోజుకో మాట చెబుతోందని మండిపడ్డారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు.. వారు నియామకపత్రాలు ఇచ్చి వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని సీరియస్ అయ్యారు. సొంత డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని విమర్శించారు. పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని , ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కేటీఆర్ చెప్పారు.

KTR told real reasons why they lost recently
KTR

బీజేపీ వాళ్ళు గుడికట్టి ఓట్లడుగుతున్నారని, అలాగైతే మనం కూడా యాదాద్రి ఆలయం కట్టామని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలంటే.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ కేటీఆర్ చుర‌క‌లు అంటించారు. తెలంగాణ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ .. తాను ప్రత్యేకంగా సర్వే చేయించాననీ, తన సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా వెల్లడవుతుందనీ, ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానమేనని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

12 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

19 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago