Konijeti Rosaiah : మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురించి రాజకీయ విశ్లేషకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో కొణిజేటి రోశయ్య జన్మించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో కేబినెట్‌లో పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు..రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.
అయితే అప్పట్లో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంతో పాటు ఆయన క్యాబినేట్‌పై కూడా తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ ఒక్కరు కూడా కిక్కుమనకుండా చేసేవారు. ‘రోశయ్య 2004-09 కాలంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అల్లుడు వైజాగ్‌లో ఓ క్లబ్‌లో పెకాడుతూ.. క్యాబరే చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. దీనిమీద అసెంబ్లీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత మెల్లగా లేచిన రోశయ్య స్పీకర్‌తో ఇలా అన్నారు. ‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు ఎన్టీ రామారావుకు నాకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు.. అని అన్నారు.. అంతే దెబ్బకు టీడీపీ సైలెంట్.. అయింది. అలానే ఓ సారి టీడీపీ సభ్యులు రోశయ్య మీద దాడి స్టార్ట్ చేశారు.. రోశయ్యకు తెలివితేటలు మరీ ఎక్కువయ్యాయంటూ వెటకారాలు మొదలెట్టారు.. దానికి ఆయన సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు.
‘నాకు అన్ని తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకు ఉండిపోతాను..? అంత తెలివే ఉంటే నన్ను నమ్మిన వైఎస్‌ను వెనుక నుంచి ఒక్క పోటు పొడిచి సీఎం కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని పొడిచేవాడిని.. విజయభాస్కర్‌రెడ్డిని పొడిచేవాడిని..’’ అంటూ ఆనాడు రోశయ్య అసెంబ్లీ రిప్లై ఇచ్చారు. రోశయ్య వాగ్దాటికి టీడీపీ వైపు నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలా రోశయ్య కామెంట్స్ ఉంటాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో రోశయ్య చంద్రబాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు. తనదైన శైలిలో తాను పోతుంటాడు. 18గంటల పాటు పని చేస్తాడు. ఇద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉంది తప్ప, పర్సనల్‌గా ఎలాంటిది లేదు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. రోశయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…