Kirak RP : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రచారాలు కూడా ఊపందుకుంటున్నాయి. పలు ప్రాంతాలలో సంచరిస్తూ జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.అయితే పవన్ కళ్యాణ్ కోసం జబర్ధస్త్ ఆర్టిస్ట్‌లు కొందరు పిఠాపురం వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. వారిపై వైసీపీ క్యాంప్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులని, డబ్బు తీసుకుని ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మొన్నామధ్య మంత్రి రోజా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వాళ్లవి చిన్న ప్రాణాలని పట్టించుకోవాల్సిన అవసరం లేవంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గెటప్ శ్రీను ఘాటుగానే బదులిచ్చారు. తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తానని .. జనసేన నుంచి రూపాయి వచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తమను ఎవరూ ప్రచారానికి పిలవలేదని, తామే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ కోసం తిరుగుతున్నామని తేల్చిచెప్పారు.
రోజా చేసిన వ్యాఖ్యలకు కిరాక్ ఆర్ పి మాత్రం తీవ్రంగా స్పందించారు. మేమంతా చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే, రోజా ఇంటర్నేషనల్ ఆర్టిస్టా.. అంటూ కిరాక్ ఆర్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటామని, గౌరవించకపోతే రోజా అంటామన్నారు. ఆమె ఏమైనా నేషనల్ అవార్డు ఆర్టిస్టా.. ఆ యువరాణికి ఏమైనా 10నేషనల్ అవార్డులు, 10ఆస్కార్ అవార్డులు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. జనసేనకు సపోర్ట్ చేస్తున్న వాళ్లంతా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నవారని, జనసేన, టిడిపిపై ఉన్న ఇష్టంతో ప్రచారం చేస్తున్న వారన్నారు. ఏపీలో మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉందన్నారు. చిన్నచిన్న ఆర్టిస్టులు అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే గెటప్ శీను చేసే ఒక క్యారెక్టర్ అయినా నీ జీవితంలో చేయగలవా అంటూ రోజాకు కిరాక్ ఆర్ పి చాలెంజ్ విసిరారు.
సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూ తన చరిష్మా తో సినిమా హీరో అయ్యాడని, రోజా కంటే వాడికి పదిరెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉందని కిరాక్ పార్టీ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళతో నువ్ పోటీ పడగలవా సుడిగాలి సుధీర్ తో రోజా పోటీ పడగలదా అని ప్రశ్నించారు. అంతే కాదు హైపర్ ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చాడని, అది వేసే పంచులకు రోజా జడ్జిమెంట్ ఇస్తే చాలని, కానీ ఆది గంటపాటు అందరిని ఏకధాటిగా నవ్వించి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు అన్నారు. ఆదితో నువ్వు పోటీ పడగలవా అంటూ రోజాను ప్రశ్నించారు. నీ బతుకులో ఎప్పుడైనా ఈ ముగ్గురు లాంటి చరిష్మా చూసావా? నిన్నెవరు ఒక మాట కూడా అన్నప్పుడు నీకెందుకు ఉలుకెక్కువ అంటూ ప్రశ్నించారు.నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుందని, ఈసారి ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి.. మా రోజమ్మ అంటూ కిరాక్ ఆర్పి దారుణమైన కామెంట్స్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…