Allu Arjun BMW Car : గంగోత్రితో తొలిసారిగా ప్రేక్షకులని పలకరించి ఆర్యలో కాలేజ్ కుర్రాడిలా అందరి మనసులు కొల్లగొట్టిన బన్నీ ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకెళ్లాడు. టాలీవుడ్ లో డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రసైన అల్లు అర్జున్.. యువతలో స్టైల్ కు ఐకాన్ నిలిచాడు. అదిరిపోయే డ్యాన్సులతో, ఆకట్టుకునే నటనతో తెలుగుతో పాటు మలయాళంలోనూ స్టార్ గా ఎదిగిన అల్లుఅర్జున్ కి స్టైల్ గా ఉండే కార్లంటే అమితమైన ఇష్టం. ఆయన గ్యారేజ్ లో ఎన్నో విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఇటీవల బన్నీ ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. గతంలో తన కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు.
తన బీఎండబ్ల్యూ-ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. బీ.ఎం.డబ్ల్యూ -ఐ7 సిరీస్ కారు సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ కారుకు TG009 6664 నంబర్ కేటాయించినట్లు ఖైరతాబాద్ రవాణాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. హీరో అల్లు అర్జున్ రవాణా శాఖ కార్యాలయానికి రావడంతో ఆయనని అభిమానులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక బన్నీ దగ్గర స్టైలిష్ కార్లతో పాటు ఇతర వాహనాలు కూడా ఉన్నాయి. వాటి ధర ఆకాశాన్ని అంటుతుంటాయి. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో బన్నీ రేంజ్ ఓ రేంజ్‌లోనే ఉంటుంది.
ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ఆయన చేస్తున్న పుష్ప-2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో హీరోయిన్గా రష్మిక మందాన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల పుష్ప మూవీ మేకర్స్ సినిమా నుంచి ‘పుష్ప పుష్ప’ పేరిట ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా ఆరు భాషల్లో రిలీజైన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…