కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ రియల్టర్ దారుణ హత్యకి గురి కావడం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆమెకు భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని భగత్‌నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్‌లో ఈమె హత్యకి గురి కాగా, బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సరిత (38)కు మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన శ్రీపాల్‌రెడ్డితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు అశ్విత్‌రెడ్డి (16), మణిత్‌రెడ్డి (14) ఉన్నారు. మృతురాలి భర్త శ్రీపాల్‌రెడ్డి వ్యాపారం చేస్తుండగా, కొడుకులు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో వారే విడివిడిగా ఉంటున్నారు. సరిత రాంనగర్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ తన సోదరుడి షాపు వ్యవహారాలు చూసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నది. ఈ క్రమంలోనే భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్‌మెంట్ 203 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరూ వ్యాపార భాగస్వాములుగా మారారు.
వ్యాపారం నిమిత్తం వెంకటేశ్‌కు సరిత రూ. 20 లక్షలు ఇచ్చింది. ఆ మొత్తం ఎన్నిసార్లు అడిగిన అతను దాటవేస్తూ వచ్చాడు. అయితే తాను ఓ రోజు డబ్బులు ఇస్తానని భగత్‌నగర్‌లోని తన అపార్టుమెంట్ కి పిలిపించుకున్నాడు. సరిత తాను వరంగల్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెంకటేశ్ వద్దకు వెళ్లింది. శుక్రవారం ఉదయం సరిత ఫోన్ నుంచి ఆమె సోదరి స్వాతి, సోదరుడు సతీశ్ నెంబర్లకు ‘మీ అక్క తల గోడకేసుకొని కొట్టుకొని, దెబ్బలతో నా ప్లాట్‌లో పడి ఉంది. వెళ్లి తాళం పగులగొట్టుకొని తీసుకెళ్లండి’ అని సందేశం వచ్చింది. వెంటనే స్వాతి తన సోదరుడితో కలిసి అక్కడికి వెళ్లి తాళం పగులగొట్టి చూడగా, సరిత తీవ్ర గాయాలతో ముక్కు, నోటి నుంచి రక్తస్ర్తావమై గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడక మృతి చెంది కనిపించింది. వెంకటేశ్ ఆమెను దారుణంగా హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…