Kantara : ప్లీజ్.. అలా అన‌కండి. కాంతారా అభిమానుల‌కి ద‌ర్శ‌కుడు రిక్వెస్ట్..

Kantara : కన్న‌డ సినీ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చి దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం కాంతారా. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కరగందూర్ని నిర్మించారు. కన్నడలో గత నెల సెప్టెంబర్ 30న విడుదలైన కాంతార మూవీ 100 కోట్లు క్లబ్‌లో చేరింది. దీంతో గతవారం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయగా, అన్ని భాషాల్లో కాంతార సూపర్ హిట్ అయ్యింది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాల తర్వాత, నేషనల్ వైడ్‌గా సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని కొన‌సాగిస్తూనే ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను రిషబ్ శెట్టి వెల్లడించారు. కాంతార సినిమా చూసినవాళ్లకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా చూసినవాళ్లు.. అందులో వచ్చిన శబ్ధాలను అనుకరించ వద్దని రిషబ్ శెట్టి కోరారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో ఆరంభం నుంచి ఆ ‘ఓ’ అనే అరుపు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కథలో ప్రేక్షకుల్ని పూర్తిగా లీనం చేసేందుకు ఆ అరుపుని దర్శకుడు రిషబ్ శెట్టి చాలా చోట్ల వాడాడు. సడన్‌గా వచ్చే ఆ అరుపు విని ప్రేక్షకులు భయపడిపోతారు. ఈ శ‌బ్ధానికి ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయిపోయారు. సినిమా చూసి థియేటర్ వెలుపలికి వచ్చేటప్పుడు కూడా ఆ ‘ఓ’ అనే మనల్ని వెంటాడుతుంది.

Kantara director rishab shetty request to netizen not to imitate that sound
Kantara

ఎంతో ఎమోష‌న‌ల్ వ‌ర్డ్ అయిన ఓ అనే శ‌బ్ధాన్ని కొంద‌రు స‌ర‌దాగా వాడుతున్నారు. ఈ విష‌యం రిషబ్ దృష్టికి రాగా, ఆయ‌న రిక్వెస్ట్ చేశారు. కర్ణాటకలోని తుళునాడులో ఉన్న ఆచారాలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చిన రిషబ్ శెట్టి.. అక్కడ భూతకోల సంస్కృతి‌లో భాగంగా కోల ఆడే వ్యక్తి అలా ‘ఓ’ అనే శబ్ధం చేస్తాడని వెల్లడించాడు. ఆ అరుపు తుళునాడులో ఓ సెంటిమెంట్ అని , థియేటర్ల ముందు అలా ‘ఓ’ అంటూ అనుకరించడం వారి ఆచారాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని, ద‌య‌చేసి ఆ శబ్దాన్ని ఎవరూ అనుకరించొద్దు అని రిక్వెస్ట్ చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago