Kantara : కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతారా. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కరగందూర్ని నిర్మించారు. కన్నడలో గత నెల సెప్టెంబర్ 30న విడుదలైన కాంతార మూవీ 100 కోట్లు క్లబ్‌లో చేరింది. దీంతో గతవారం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయగా, అన్ని భాషాల్లో కాంతార సూపర్ హిట్ అయ్యింది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాల తర్వాత, నేషనల్ వైడ్‌గా సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లని కొనసాగిస్తూనే ఉంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను రిషబ్ శెట్టి వెల్లడించారు. కాంతార సినిమా చూసినవాళ్లకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా చూసినవాళ్లు.. అందులో వచ్చిన శబ్ధాలను అనుకరించ వద్దని రిషబ్ శెట్టి కోరారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో ఆరంభం నుంచి ఆ ‘ఓ’ అనే అరుపు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కథలో ప్రేక్షకుల్ని పూర్తిగా లీనం చేసేందుకు ఆ అరుపుని దర్శకుడు రిషబ్ శెట్టి చాలా చోట్ల వాడాడు. సడన్‌గా వచ్చే ఆ అరుపు విని ప్రేక్షకులు భయపడిపోతారు. ఈ శబ్ధానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమా చూసి థియేటర్ వెలుపలికి వచ్చేటప్పుడు కూడా ఆ ‘ఓ’ అనే మనల్ని వెంటాడుతుంది.
ఎంతో ఎమోషనల్ వర్డ్ అయిన ఓ అనే శబ్ధాన్ని కొందరు సరదాగా వాడుతున్నారు. ఈ విషయం రిషబ్ దృష్టికి రాగా, ఆయన రిక్వెస్ట్ చేశారు. కర్ణాటకలోని తుళునాడులో ఉన్న ఆచారాలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చిన రిషబ్ శెట్టి.. అక్కడ భూతకోల సంస్కృతిలో భాగంగా కోల ఆడే వ్యక్తి అలా ‘ఓ’ అనే శబ్ధం చేస్తాడని వెల్లడించాడు. ఆ అరుపు తుళునాడులో ఓ సెంటిమెంట్ అని , థియేటర్ల ముందు అలా ‘ఓ’ అంటూ అనుకరించడం వారి ఆచారాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని, దయచేసి ఆ శబ్దాన్ని ఎవరూ అనుకరించొద్దు అని రిక్వెస్ట్ చేశాడు.