Kalyaan Dhev : గత కొద్ది రోజులుగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ డివోర్స్ తీసుకుందంటూ ఆన్ లైన్ వేదికపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా కూడా ఈ ఇష్యూపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది లేదు. దీంతో శ్రీజ డివోర్స్ నిజమే అని జనం నమ్ముతున్నారు. శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న కూడా అతనితోను సఖ్యంగా ఉండలేక డివోర్స్ తీసుకుందని, అంతేకాదు మూడో పెళ్లికి కూడా రెడీ అయిందనే టాక్ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ పెడుతున్న పోస్టులు వీళ్ళ విడాకుల ఇష్యూని బలపరుస్తున్నాయి.
వాలంటైన్స్ డే రోజు ఈ ఇద్దరు పెట్టిన పోస్ట్‌లు చూస్తే ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ జరిగిందని అందుకే దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. కళ్యాణ్ దేవ్… ‘ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం..’ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ పెట్టగా, దానికి కౌంటర్ గా శ్రీజా ‘ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు’ అని తన సోషల్ మీడియాలో వాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేసింది. ఈపోస్ట్‌లు అభిమానులలో అనేక అనుమానాలు లేవనెత్తేలా చేస్తున్నాయి.
ఇక కళ్యాణ్ దేవ్.. శ్రీజ నుండి దూరంగా వెళ్లినప్పటికీ అతను గురించే ప్రతీసారి బాధపడుతున్నట్టుగా అతని పోస్ట్ లు చూస్తుంటే తెలుస్తుంది. కళ్యాణ్ దేవ్ రీసెంట్‌గా హోలీ వేడుకల్లో పాల్గొనగా, ఆయన తన అభిమానులు, మిత్రులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. పిక్‌లో చాలా కూల్‌గా సంతోషంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని, అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన ఇద్దరు తిరిగి కలవాలని వారిద్దరు సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.