Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల విషయంలో ఎంత హాట్ టాపిక్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. శిరీష్ భరద్వాజ్ నుండి విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకున్న శ్రీజ ఇప్పుడు ఆయన నుండి కూడా విడిపోయినట్టు ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కొన్నినెలలుగా విడి విడిగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ఇద్దరూ కలిసున్న ఫోటోలను డిలీట్ చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.
అయితే కొద్ది రోజులుగా వీరు షేర్ చేసే పోస్టులు సైతం క్షణాల్లో వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు.అలాగే తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ పోస్ట్ చేయడం.. మరోవైపు శ్రీజ కూడా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుండడంతో వారిద్దరు విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తున్నారే తప్ప డైరెక్ట్‌గా ఈ ఇష్యూపై స్పందించడం లేదు. తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. అందులో స్టేజ్ పై నిల్చున్న ఆ పాప.. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటుంది. వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్ అవుతుంది.
ఆ వీడియోని కళ్యాణ్ దేవ్ తన పోస్ట్ లో షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి. నవిష్క, నివ్రితిలను బాగా మిస్ అవుతున్నానని కళ్యాణ్ దేవ్ కామెంట్ పెట్టాడు. నవిష్క తో పాటు నివ్రితిని కూడా తలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవిష్క శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు పుట్టిన అమ్మాయి. నివృత్తి మాత్రం శ్రీజ మొదటి భర్త సంతానం. శ్రీజను వివాహం చేసుకున్నాక నివ్రితిని కూడా కళ్యాణ్ దేవ్ కూతురిగా భావించి ఆమెతో అనుబంధం పెంచుకున్నాడు. శ్రీజతో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో నవిష్క, నివ్రితి కళ్యాణ్ దేవ్‌కి దూరంగా ఉంటూ శ్రీజ వద్దే పెరుగుతున్నారు. దీంతో వారిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి లేకుండా పోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…