Kadeddulu Ekaram Nela : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తన సినిమాలు , రాజకీయాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంతటి చరిత్ర కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా విషయంలో ఎంత డెడికేషన్ తో ఉంటారో , నటీనటులతో కూడా చాలా అనుబంధాలను ఏర్పరచుకొని అందరి మనసులు గెలుచుకున్నారు.. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేసే వారట. అయితే ఎన్టీఆర్ సినిమాలలో సూపర్ హిట్స్ మాత్రమే కాదు, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.1960 సంవత్సరంలో ఎన్టీఆర్ 10 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తే.. కాడెద్దులు ఎకరం నేల మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది..
పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించిన కాడెద్దులు ఎకరం నేల సినిమాకు జంపనా దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా సి. ఎం. రాజు స్వరపరిచాడు. ఈ సినిమాలో పేదరైతు గా ఎన్టీఆర్ నటించారు. షావుకారు జానకి ఆయన సరసన నటించారు. ఇందులో రేలంగి, రమణారెడ్డి, పెరుమాళ్ళు, జగ్గారావు ఇంకా ఇతర నటులు ముఖ్య పాత్రల్లో నటించారు.అయితే జంపన్న డైరెక్షన్ లో భట్టి విక్రమార్క చిత్రం 1960 అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అయింది.
![Kadeddulu Ekaram Nela : సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడానికి కారణం ఏంటి..? Kadeddulu Ekaram Nela sr ntr movie why flop](http://3.0.182.119/wp-content/uploads/2023/01/kadeddulu-ekaram-nela.jpg)
ఈ సినిమా విజయవంతమైన తర్వాత, వారం రోజుల్లోనే కాడెద్దులు ఎకరం నేల సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే అభిమానులకు ఎనలేని ఉండడంతో కాడెద్దులు ఎకరం నేల సినిమాపై కూడా చాలా మక్కువ చూపించారు. కాడెద్దులు ఎకరం నేల సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు. కానీ ఈ కథలో ఏ సన్నివేశం కూడా అంతగా పండక పోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన ప్లాఫ్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో నడవగా, ఆ తర్వాత ఈ సినిమాని చూసిన వారు లేరు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా ఈ సినిమాని చెప్పాలి.