సాధారణంగా సెలబ్రిటీలు వాడే వస్తువులపై అభిమానులు ఓ కన్ను ఎప్పుడు వేసే ఉంచుతారు. వారి ఫెవరెట్ స్టార్స్ వేసుకునే బట్టలు, గాడ్జెట్స్ లా కనిపించే డూప్లికేట్ మోడల్స్ ని మార్కెట్ లో వెతికి పట్టుకుని వేసుకుంటారు. అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. టాలివుడ్ లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్స్ పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ధరించిన షర్ట్ ధర గురించి చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే.. ఉన్నాయి. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ఫారెన్ లో ఉపయోగిస్తున్న ఫ్యాషన్ ట్రిక్స్ కు ఫిదా అవుతున్నారు అభిమానులు.
తాజాగా తారక్ వేసుకున్న జర్కన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ బ్లాక్ హుడీ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు ఎన్టీఆర్. రాల్ఫ్ లారన్.. అనే హుడి తారక్ వేసుకోవడం చూసిన ఫ్యాన్స్ దీని ధర ఆన్ లైన్ లో చెక్ చేశారు. దీని ధర ఏకంగా 65,407 ఉంది. ఇది విని అందరు అవాక్కవుతున్నారు. ఇలా ఇండస్ట్రీలోఅగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో లగ్జరీ లైఫ్ గడపడానికి ఎంతో ఇష్టపడతారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైనది మంచి బ్రాండ్ కు సంబంధించిన వస్తువులు అయి ఉంటాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ కి వాచ్ అంటే ఎంతో ఇష్టం తనకు ఇష్టమైన వాచ్ కోసం కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి.అలాగే కార్ల విషయంలో కూడా ఎన్టీఆర్ ఏ మాత్రం రాజీపడడు. ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైనది కొనుగోలు చేస్తూ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు . మార్కెట్ లోకి కొత్త కారు ఏది వచ్చినా.. వెంటనే కొనుగోలు చేసేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ తో ఆ కార్ లో రైడ్ లకు వెళ్తూ ఉంటాడు. ఆమధ్య తారక్ కొన్న కొత్త కారు రేటు కూడా వైరల్ అయ్యింది. మొత్తానికి ఇలా ఖరీదైన వాచ్ లు టీ షర్టులు షూస్ ధరిస్తూ యంగ్ టైగర్ రాయల్ లైఫ్ గడుపుతున్నారని చెప్పాలి.