Jr NTR : తన తాత నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించగా, ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇప్పుడు కొరటాలతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఎన్టీఆర్ కొన్ని సందర్భాలలలో పలు కారణాల వలన ఆరు సూపర్ హిట్ సినిమాలని తిరస్కరించాడట. అందులో మొదటిది వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితన్ హీరోగా తెరకెక్కిన దిల్. ఈ పాత్రను తొలుత జూనియర్ ఎన్టీఆర్ కు ఆఫర్ చేశారు. అతను విద్యార్థి పాత్రలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నితిన్‌ని ఎంపిక చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక అల్లు అర్జున్ కెరియర్‌ని మార్చేసిన చిత్రం ఆర్య. ఈ సినిమా భారీ విజయం సాధించడంతోపాటు అల్లు అర్జున్‌కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ని జూనియర్ పలు కారణాల వలన తిరస్కరించాడట.
ఇక రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం భద్ర. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలిసిందే. ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరు స్టార్ హీరోలు తిరస్కరించినట్టు సమాచారం. ఇక ఊపిరి సినిమాని కూడా ఎన్టీఆర్ వదులుకున్నాడట. అందుకు కారణం నాగార్జున పాదాలను తాకే నిర్దిష్ట సన్నివేశం అని అంటుంటారు. అలా చేస్తే అది తన అభిమానులకు బాగా వెళ్ళకపోవచ్చని నటుడు భావించి రిజెక్ట్ చేశాడట. ఇక రవితేజ్ కెరీర్‌లో సూపర్ హిట్ మూవీ కిక్‌ని కూడా ఎన్టీఆర్ వద్దన్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అశోక్, అతిథి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో ఈ సినిమాని వద్దన్నాడట. ఇక మహేష్-కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు రాగా, వివిధ కారణాల రీత్యా ఈ చిత్రాన్ని తిరస్కరించాల్సి వచ్చిందట. ఈ ఆరు సినిమాలు ఎన్టీఆర్ చేసి ఉంటే ఇప్పుడు ఆయన క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లేదో మరి.