Jr NTR In Oscars : స్టార్ సెలబ్రిటీస్ ధరించే కాస్ట్యూమ్స్ మొదలుకుని వాచ్ ల వరకు అన్నింటి గురించి సోషల్ మీడియాలో తెగ ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంటుంది. స్టార్ హీరో షూస్, వాచ్‌ల గురించి అయితే లెక్కలేనన్ని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. ఆ మధ్య ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెగ వైరల్ అయిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేశారు ఎన్టీఆర్.నెవర్ బిఫోర్ అనేలా కనిపించి ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
అయితే ఆ సమయంలో తారక్ సూపర్బ్ డ్రెస్సింగ్‌తో పాటు చేతికి పెట్టుకున్న వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వాచ్ ధన ఎంతా అని ఆరా తీస్తే అందరికి ఫీజులు ఎగిరిపోయాయి. జూనియర్ పెట్టుకున్న వాచ్ పటెక్ ఫిలిప్పి నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్ ధర అక్షరాలా 190,000 డాలర్స్. అంటే మన రూపాయల్లో 1 కోటి 56 లక్షల 13,155. ఈ రేటు చూసి ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు యావత్ భారతదేశం ఎంతగా పులకించిపోయిందో మనం చూశాం.
అయితే విమానాశ్రయం బయట ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ వచ్చినందుకు గర్వంగా ఉందన్నాడు. తమకు సపోర్ట్ చేసిన ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రేమించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…